శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం సాయంత్రం సత్యసాయి శతజయంతి ఉత్సవాలపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సత్యసాయి శతాజయంతి ఉత్సవాలకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నదని, అందుకు తగ్గట్టుగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని, భద్రత చర్యల్లో లోటుపాటు ఉండరాదని కలెక్టర్ తెలియజేశారు.