జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు నినాదాలు చేస్తూ వారి డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా పరిపాలనా సౌకర్యాలు అందాలంటే డివిజన్ ఏర్పాటు అవసరమని వారు తెలిపారు. అధికారుల స్పందన కోరుతూ శాంతియుతంగా ర్యాలీ కొనసాగింది.