కనిగిరి మండలంలోని హనుమంతునిపాడు రహదారిలో నిర్మించిన అటవీశాఖ నగరవణాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నగరవనంలో వసతులను ఆయన పరిశీలించి, మరిన్ని మౌలిక వసతులతో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేయడం ద్వారా నగరవణానికి సందర్శకులు తాకిడి పెంచవచ్చని, ఆ దిశగా కృషి చేయాలని అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. వచ్చే నూతన సంవత్సర వేడుకలను అధికారికంగా నగరవనంలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.