మార్కాపురం: పొదిలి అభివృద్ధికి 22 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా పొదిలి వాసవి మాతా ఆలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్చి కి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పొదిలి అభివృద్ధికి 22 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో మంజూరు అవుతాయని సిసి రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేయబోతున్నామన్నారు. తాగునీటి సమస్యకు సంబంధించి నవంబర్ 7వ తేదీ జరుగు డీఆర్సీ మీటింగ్ లో ఇన్చార్జి మంత్రి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు