ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి చూసుకోవాలని వాహనదారులకు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమాణాలు తప్పవని హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడితే కలుగు అనర్ధాలను పోలీసులు తెలిపారు.