భువనగిరి: భువనగిరి అభివృద్ధి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి అభివృద్ధి పై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నేషనల్ హైవే డి ఈ,ఎఇ ఇతర అధికారులు పాల్గొన్నారు. భువనగిరి నుంచి గజ్వేల్ వెళ్లే జాతీయ రహదారి 70 కిలోమీటర్ల వరకు రోడ్డు మర్మతుల పనులకు 7 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.భువనగిరి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.