నారాయణ్‌ఖేడ్: మార్డి పెద్ద చెరువు కబ్జా కాకుండా చూడాలని సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతిపత్రం అందించిన రైతులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హార మండలం మార్డి పెద్ద చెరువు కబ్జా కాకుండా చూడాలని రైతులు శనివారం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందించారు. గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చెరువును కబ్జా చేయాలని చూస్తున్నారని ఆ పనులు ఆపివేయాలని సబ్ కలెక్టర్‌కు వినతిపత్రంలో కోరారు.