నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు సిపి సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాతబడ్డ రైస్ మిల్లులో దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాజులను పట్టుకున్నారు. వారి నుంచి ఆరు సెల్ఫోన్లు, 15780/- రూపాయలు నగదు ను స్వాధీనపరుచుకున్నారు.