కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం తెలిసిన వివరాల ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.