కోరుట్ల: మెట్ పల్లి విద్యార్థి దశలో పది సంవత్సరాలు కష్టపడితే చాలు 60 సంవత్సరాలు హాయిగా ఉండొచ్చుఅన్న ఆర్డిఓ శ్రీనివాస్
మెట్పల్లి '10 ఏళ్లు కష్టపడితే చాలు' లక్ష్య సాధనకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి నక్క శ్రీనివాస్ అన్నారు. మెట్పల్లిలోని ప్రయివేట్ డిగ్రీ కళాశాల నూతన విద్యార్థుల స్వాగతోత్సవ వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్ధి దశలో 10 సంవత్సరాలు కష్టపడితే, మిగతా 60 సంవత్సరాలు ఆనందంగా ఉండచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగాధర్, కరెస్పాండంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.