ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి నాగయ్య డిమాండ్ చేశారు. రాయదుర్గంలో బుధవారం కూటమి హామీల పత్రాలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామమన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ధ్వజము. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పిపిపి జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు శంకర్, సురేష్, మారేష్, నాగరాజు, రామాంజి, వెంకీ, సింహద్రి తదితరులు పాల్గొన్నారు.