ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని వ్యక్తుల చెరువు క్రైస్తవ ప్రార్థన మందిరంలో సోమవారం బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని పాస్టర్ డేవిడ్ నిర్వహించారు. యోహోవా సువార్త అంశంపై 50 మార్కులకు నిర్వహించిన ఈ క్విజ్‌లో ముగ్గురిని విజేతలుగా నిర్ణయించి మొదటి బహుమతి 3000 రెండవ బహుమతి 2000 మూడో బహుమతి వేయి రూపాయలు అందజేసినట్లు పాస్టర్ డేవిడ్ తెలిపారు. బైబిల్ పై యువతకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాస్టర్ తెలిపారు.