ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ని ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి బుధవారం గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి సందర్శించారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో ఐజి సమావేశం నిర్వహించి క్రైమ్ రిపోర్ట్ పై ఆరా తీశారు. దొంగతనాలు రోడ్డు ప్రమాదల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి తెలిపారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల తరలింపు అరికట్టే అంశంలో దృష్టి సారించాలని ఇక పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలన్నారు.