బజార్హత్నూర్: పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క త్వరలో బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, మీటింగ్ స్థలం తదితర వాటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చూశారు.అనంతరం గ్రామస్తులతో సమావేశమైన కలెక్టర్ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.