గుర్రప్పాలెంలో విద్యుత్ ఘాతుకానికి గురైన వ్యక్తికి తీవ్ర గాయాలు
జగ్గంపేట మండలం గుర్రప్పాలెం శివాలయం సమీపంలో శనివారం సురేష్ అనే వ్యక్తి విద్యుత్ లైన్ కు అడ్డు వచ్చిన చెట్లు కొమ్మలను నరికే క్రమంలో ఉన్న విద్యుత్ రెండు లైనులకు ఒక లైన్ మాత్రమే విద్యుత్ నిలుపుదల చేసి మరొక లైనుకు విద్యుత్ నిలుపుదల చేయకపోవడంతో చెట్లు కొమ్ములు నరుకుతున్న సమయంలో విద్యుత్ వైర్ కాలుకు తగలడంతో షాక్ తగిలి సురేష్ కింద పడ్డాడు. దీంతో కాలుకు తీవ్రంగా గాయం అవడంతో అక్కడున్న స్థానికులు చికిత్స నిమిత్తం జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు.