అసిఫాబాద్: సీజేఐపై దాడిపై చేసిన వ్యక్తిని శిక్షించాలి: MRPS
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని MRPS జాతీయ ఉపాధ్యక్షుడు కేశవరావ్ అన్నారు. సీజేఐపై దాడికి నిరసనగా శుక్రవారం ఆసిఫాబాద్ తహసీల్దార్ ఎదుట నల్ల జెండాలతో నిరసన తెలిపి ధర్నా చేశారు. దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని రాజ్యాంగ దాడిగా పరిగణించాలని డిమాండ్ చేశారు.