ఆలూరు: ఆలూరులో తాగునీటి పైపులలో డ్రైనేజీ నీరు కలిసి కలుషితమవుతున్నాయని, సిపిఎం ఆధ్వర్యంలో అధికారులకు వినతి
Alur, Kurnool | Sep 15, 2025 ఆలూరు మండల కేంద్ర జీరా వీధిలో తాగునీటి పైపులలో డ్రైనేజ్ నీరు కలుస్తోందని సీపీఎం మండల అధ్యక్షుడు పి.హనుమంతు, కేపీ నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారు మేజర్ గ్రామపంచాయతీ అధికారులను కలిసి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా అనేక వీధుల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడాన్ని వారు విమర్శించారు.