గంగాధర నెల్లూరు: జీడీనెల్లూరు నూతన ఎంపీడీవోగా మనోహర్ గౌడ్
జీడీనెల్లూరు నూతన ఎంపీడీవోగా మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా చిట్టమూరు డిప్యూటీ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఇటీవల ప్రమోషన్ వచ్చింది. మొట్టమొదటిసారి జీడీనెల్లూరు ఎంపీడీవోగా ఛాన్స్ రావడంతో గురువారం బాధ్యతలు చేపట్టారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గత ఎంపీడీవో కృష్ణ మహేశ్ రెడ్డి బదిలీ కావడంతో నెల రోజులు ఇన్ఛార్జ్ ఎంపీడీవోగా లోకేశ్ విధులు నిర్వర్తించారు.