గుంతకల్లు: గుత్తి పరమేశ్వరయ్య పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ వేశారని పోలీసులు, రెవెన్యూ అధికారులకు బాధితుడు ఫిర్యాదు
గుత్తిలోని గాంధీ సర్కిల్ సమీపంలో ఉన్న పరమేశ్వరయ్య పెట్రోల్ బంకులో మంగళవారం కల్తీ పెట్రోల్ చేశారని గుత్తికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సురేష్, డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణ, సీ ఎస్ డీ టీ ప్రవీణ్ కుమార్ లు పరమేశ్వరయ్య పెట్రోల్ బంకు వెళ్లారు. ఈ సందర్భంగా బాధితుడు చంద్రశేఖర్ ను విచారించారు. బాటిల్ లో తాను ఒక లీటరు పెట్రోల్ పోయించుకున్నానన్నారు. కల్తీ పెట్రోల్ పోశారని ప్రశ్నిస్తే తనపైనే ఎదురు తిరిగారని చెప్పాడు. నాలుగు బాటిళ్ల లో పెట్రోల్ సాంపుల్ తీసుకున్నారు. ల్యాబ్ కు పంపిస్తామని రెవెన్యూ, పోలీస్ అధికారులు చెప్పారు.