భూపాలపల్లి: జాతీయ మెగా లోక్-అదాలత్ లో భూపాలపల్లి జిల్లాలో 1466 కేసుల రాజీ : జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ వెల్లడి
జాతీయ మెగా లోక్-అదాలత్ లో భూపాలపల్లి జిల్లాలో 1466 కేసుల రాజీ - జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ తెలిపాజాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, భూపాలపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన కేసులను సవ్యంగా పరిష్కరించడం జరిగింది. ఐ.పి.సి & BNS కేసులు – 355, సైబర్ క్రైమ్ – 15, డి.డి & MV యాక్ట్ – 1096, మొత్తం = 1466 కేసులు ఈ కేసుల్లో ఇరు వర్గాలను రాజీ కుదిర్చి సమస్యలను సత్వర పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయడం లోక్-అదాలత్ ప్రధాన ఫలితం. 15 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 88000/- మొత్తాన్ని రికవరీ అయింది అన్నారు