వరదయ్యపాలెం విజిఆర్ నగర్ కాలనీలో మరుగునీటితో అవస్థలు పడుతున్న ప్రజలు
వరదయ్యపాలెం: మురుగు నీటితో అవస్థలు వరదయ్యపాలెం మండలం వీజీఆర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. వీధి మొత్తం మురుగునీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దుర్వాసనతో పాటు దోమల వ్యాప్తి పెరిగిందన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.