నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో వివిధ వాహనాల యజమానులు లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే శాఖపరమైన చర్యలతో పాటు జరిమానా తప్పదని ఎస్ఐ రమేష్ బాబు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. లైసెన్స్ లేని వాహనదారులకు, ద్విచక్ర వాహనానికి నంబరు ప్లేటు లేని వాహనాలకు ఆయన జరిమానాలు విధించారు. వాహనాల తనిఖీలో ఎస్ఐ తిరుపాలు-2, సిబ్బంది పాల్గొన్నారు.