క్రీస్తు బోధనలను ఆచరించి ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని కనిగిరి మున్సిపాలిటీ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం కాశిరెడ్డి కాలనీలోని హోసన్నా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రీస్తును స్మరించుకున్నారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. యేసు జన్మించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రతి ఒక్కరు ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు.