అనంతపురం జిల్లా పామిడి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడి శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శ్రీనిధి డాబా వద్ద ఈ నెల 26న రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని అతడిని గుర్తిస్తే 9440796827 నంబర్ కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.