తిరుమల శ్రీవారి సేవలో కమెడియన్ రఘు
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు కమెడియన్ రఘు మంగళవారం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం తీర్థ ప్రసాదాలు అందజేశారు.