శ్రీకాళహస్తిలో రేపు 2K రన్ శ్రీకాళహస్తిలో యూనిటీ ఫర్ రన్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు DSP నరసింహమూర్తి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు శ్రీకాళహస్తిలోని ద స్కూల్ నుంచి రన్ ప్రారంభం అవుతుందన్నారు. వీఎంసీ సర్కిల్, గాలిగోపురం, సూపర్ బజార్, పెళ్లి మండపం, కుమార్ స్వామి తిప్ప మీదుగా బస్టాండ్ వరకు రన్ ఉంటుందన్నారు. ప్రజలు పాల్గొనాలని కోరారు.