తాడిపత్రి: తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో భార్య గొంతు నలిమి చంపి తను ఆత్మహత్య చేసుకున్న భర్త, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె లో విషాదం చోటుచేసుకుంది.జోత్స్న అనే వివాహితను ఆమె భర్త ఆంజనేయులు గొంతు నిలిమి చంపి,అనంతరం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.క్లూస్ టీమ్ ద్వారా ఈ ఘటన కు సంబంధించిన వివరాలను త్వరితగతిన చేధిస్తామని పోలీసులు తెలిపారు .ఈ ఘటన కు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.