డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే మన ధ్యేయం : నెల్లూరు జిల్లా పోలీసులు
విద్యార్థులు యువత మత్తు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని నెల్లూరు జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ ప్రవేట్ స్కూల్స్.. ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కల్పించారు. డ్రగ్స్ ను నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే, ఎక్సైజ్, డ్రగ్స్ విభాగాల సమన్వయంతో “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24 డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు