జమ్మలమడుగు: ముద్దనూరు : రైతులకు కావాల్సిన కాంప్లెక్స్ ఎరువులు, యూరియా అందుబాటులో ఉన్నాయి - ఏఓ వెంకట క్రిష్ణారెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలంలోని రైతులకు గురువారం వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి పలు విషయాలు ప్రకటన ద్వారా తెలిపారు.మండలంలోని ఆయా రైతు సేవా కేంద్రాల్లో కాంప్లెక్స్ ఎరువులు 20.20.0.13, డిఏపి, 28.28.0 ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 20.20.0.13 ఎరువు 50 కిలోల బస్తా ధర 1400/-, డీఎపి 50 కిలోల బస్తా ధర 1400 /-చొప్పున అలాగే శెట్టివారిపల్లె,యామవరం రైతు సేవా కేంద్రాల్లో యూరియా 19.8 మెట్రిక్ టన్నులు 440 బస్తాలు అందుబాటులో ఉందన్నారు.