ఏలూరులో వైసీపీ నేత మోరు రామరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత, సోషల్ మీడియా వీడియో పై ఆందోళనకారులు ఆగ్రహం
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఏలూరులోని కొల్లేరు ప్రాంతానికి చెందిన వైసీపీ నేత మోరు రామరాజు ఇంటి వద్ద వడ్డుగూడెం గ్రామస్థులు చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తమైంది. ఉదయం నుంచి ధర్నా కొనసాగుతుండగా, రామరాజు విడుదల చేసిన సెల్ఫీ వీడియోపై గ్రామస్థులు ఆగ్రహంతో అపార్ట్మెంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు డౌన్ డౌన్.. రామరాజు బయటకు రావాలి అంటూ గ్రామస్థులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.