పుట్టపర్తి సత్యమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు సత్యమని దుర్గాదేవి అలంకరణలో అలంకరించి పూజలు జరిపామని ఆలయ పూజారి బాలచందర్ తెలిపారు. నవరాత్రులు ముగిసే వరకు ప్రతి రోజూ ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శనానికి ఉంచి పూజలు కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.