తాడిపత్రి: కార్తీక మాస ఉత్సవాలు అంటే తాడిపత్రి వైపు చూసేలా చేద్దాం : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లాలో కార్తీకమాసం ఉత్సవాలంటే తాడిపత్రి వైపు చూసేలా చేద్దామని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో జరుగుతున్న కార్తీకమాసం ఏర్పాట్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఆలయ ఛైర్మన్ చంద్రమోహన్ తో కలిసి పనులు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ దీప అలంకరణతో తీర్చిదిద్దాలని సూచించారు.