మేడిపల్లి: వ్యాధుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి,భీమారం మండల కేంద్రంలో పరిశరాలను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి
వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ప్రబులుతున్నాయని ప్రజలు ఎప్పటికప్పుడు ఇంటి పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి సమియొద్దిన్ అన్నారు.భీమారం మండల కేంద్రంలో డెంగ్యూ కేసులు నమోదు కావటంతో సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు గ్రామాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.ప్లాస్టీక్ కు సంబందించిన వస్తువులను దూరంగా ఉంచాలని ,అలాగే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు ఆయనతో పాటు ఎన్సీడీసీఓ ఆర్గనైజర్ మురళి హెచ్ ఎస్ పుష్పలత ఎంఎల్ హెచ్పి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.