కళ్యాణదుర్గం: ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఫోటోను తొలగించిన వారిపై చర్యలు తీసుకోండి: వేపులపర్తిలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలా స్వామి
బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామ సమీపంలో తారు రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే శిలాఫలకంలో ఉన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఫోటోను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం(తుడిపివేశారు) తొలగించారు. సంఘటనా స్థలాన్ని రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలా స్వామి పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన మాట్లాడారు. శిలాఫలకం పై ఉన్న ఎమ్మెల్యే ఫోటోను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోటోను తొలగించగలరేమో కానీ ప్రజల హృదయాల్లో సురేంద్రబాబు స్థానాన్ని ఎవరు చెరిపి వేయలేరన్నారు. అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.