నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. నాగోల్ సాయి నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 1 లో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్, ప్రమీల భార్యాభర్తలు, భాస్కర్ రిటైర్డ్ బాల్ భవన్ ఉద్యోగి. భాస్కర్ కు ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. గత నెల 17న అమెరికా వెళ్ళగా ఈ చోరీ చోరీ చేసుకుంది.