మేడ్చల్: మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
షామీర్పేట్ పరిధి అంతాయిపల్లి లోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కలెక్టర్ మనో చౌదరి వారి చిత్రపటానికి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకురావాలన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.