గూగుల్ డేటా సెంటర్ రావడానికి గల కారణం సీఎం చంద్రబాబు, ఐటీ మినిస్టర్ లోకేశే కారణమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. మంగళవారం కనిగిరిలో నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అయిన గూగుల్ డేటా ఏఐ హబ్ విశాఖలో రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని మంత్రి స్వామి అన్నారు.