బెలుమ్ గుహల సమీపంలో ఢీకొన్న రెండు లారీలు, డ్రైవర్లకు స్వల్ప గాయాలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల పరిధిలోని బెలుంగుహలు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి తాడిపత్రి వెళ్లే లారీ మలుపులో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీ కొంది. డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో సుమారు 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.