నరసన్నపేట: భూమిని సంరక్షించుకోవలసిన బాధ్యత అందరిది: ప్రిన్సిపల్ డా. లత
నరసన్నపేట: మనం నివసిస్తున్న భూమిని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. లత అన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ భూమిపైన మానవులతో పాటు లక్షలాది జీవరాసులు ఎన్నో జీవనం కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. వాటి సంరక్షణ కోసమైనా అందరూ బాధ్యతగా మెలగాలని ఆమె స్పష్టం చేశారు.