జమ్మలమడుగు: కొండాపురం : నేషనల్ హైవేపై లైట్లు మరమ్మతులు చేయాలి - డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం లోని కొండాపురం మండలంలోని నేషనల్ హైవే పై లైట్లు వెలగకపోవడం తో వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గురువారం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ కడపలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపురం నేషనల్ హైవే మీదుగా వందల సంఖ్య లో వాహనాలు రోజు వెళ్లడం జరుగుతున్నదని అన్నారు.ఈ మార్గాన తాడిపత్రి,అనంతపురం వెళ్ళే బస్సులు,భారీ లారీ వంటి వాహనాలు,బైకులు నిత్యం రద్దీగా తిరగడం జరుగుతుందన్నారు.