ప్రజలు స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో 1,2 కేసులు మాత్రమే నమోదయ్యా యని కలెక్టర్ రాజాబాబు అన్నారు. చీమకుర్తి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని, ఇది ప్రాణాంతకం కాదన్నారు. మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.