ఈనెల 29వ తేదీన నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో సిపిఐ శతజయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి రంగనాయకుడు పిలుపునిచ్చారు బుధవారం బనగానపల్లె మండల సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించిందని 2025 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతజ ఉత్సవాలు నిర్వహించుకోబోతుందని తెలిపారు ఈ 100 సంవత్సరాలలో అనేక పోరాటాలు చేసిందని ఆయన గుర్తు చేశారు ఈ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు