సంగారెడ్డి: మహిళలు ఆత్మస్థెర్యాన్ని పెంచుకోవాలి: తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ మహిళలు ఆత్మస్థెర్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కళాశాలలో 8 వారాల సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును గురువారం ప్రారంభించారు. ఈ కోర్సులో విద్యార్థులకు కుంగ్ ఫు, ఉషు క్రీడల్లో శిక్షణ ఇస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీశ్వర్, ఫిజికల్ డైరెక్టర్ అశ్విని పాల్గొన్నారు.