పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల సందడే సందడి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల సందడి మొదలైంది. గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పులికాట్ సరస్సు వరదనీటితో జలకలను సంతరించుకుంది. దీంతో వలస పక్షులైన ఫ్లెమింగో, ఇతర జాతి పక్షుల రాకతో సరస్సు వద్ద సందడి వాతావరణం నెలకొంది. అటువైపుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గురువారం ఆ ప్రాంతం అటు పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులతో, ఇటు రహదారి వెంబడి సందర్శికుల హడావిడితో సందడి వాతావరణం నెలకొంది.