శంకరంపేట ఏ: నర్సింగ్ రావ్ పల్లి శివారులో లేగా దూడ పై దాడి చేసి చంపిన పులి, ఆందోళనలో స్థానికులు
నర్సింగ్ రావ్ పల్లి శివారులో లేగా దూడ పై దాడి చేసి చంపిన పులి, ఆందోళనలో స్థానికులు... కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.బుధవారం నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావ్ పల్లి శివారులో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన లేగ దూడ పై పులి దాడి చేసి చంపేసింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొన్ని గొర్రెలను పులి చంపినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.