జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్ పై దాడి చేసిన ఉద్యోగి
Eluru Urban, Eluru | Sep 30, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ వార్డులో పేషంటుపై టెక్నీషియన్ సుధాకర్ దాడి చేశారు.తాడువాయి నుంచి డయాలసిస్ కోసం హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్ వీర రాఘవులు బెడ్డుపై డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కాలుపై కాలు వేసుకున్నాడని పేషెంట్తో వాగ్వాదానికి దిగాడు టెక్నీషియన్ సుధాకర్ ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రే తో పేషెంట్ వీరరాఘవులపై దాడి చేశారు విషయం తెలుసుకున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ బేబీ కమల డయాలసిస్ వార్డ్ లో విచారణ చేపట్టారు.