అత్తారింటి వారు వేధిస్తున్నారు నాకు న్యాయం చేయండి మీనా కుమారి జెసికి ఫిర్యాదు
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు: 'అత్తింటి వారు హింసిస్తున్నారు.. నన్ను కాపాడండి' తనను అత్తింటి వారు వేధిస్తున్నారని చిత్తూరులోని అమ్మన్ కోయిల్ వీధికి చెందిన మీనాకుమారి సోమవారం జేసీకి ఫిర్యాదు చేశారు. మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని పలుమార్లు తన భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రవర్తన మారలేదని వాపోయారు. తన భర్తను విడిచి వెళ్లే ఉద్దేశ్యం లేదని న్యాయం చేయాలని జేసీకి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని జేసీ తహశీల్దారును ఆదేశించారు.