నగరి: పుత్తూరులో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా బుధవారం పుత్తూరు పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైసిపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతోందని రోజా ఆరోపించారు.