మార్కాపురం: మార్కాపురం డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశంలో పాల్గొన్న అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసుల అధ్యక్షతన డివిజన్ పరిధిలోని మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలోని మండలాల వారిగా ప్రభుత్వా యాజమాన్యంలోని 144 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన 100 రోజుల ప్రణాళిక, ప్రాథమిక పాఠశాల స్థాయి జి ఎఫ్ ఎల్ ఎన్ అంశాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.