అనంతపురం నగర శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న రాచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయనను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.